దొంగ, దగా, దోఖాబాజ్ ఎమ్మెల్యే..!
– ఆయనతోనే తాండూరుకు చెడ్డపేరొచ్చింది
– ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొంద పెట్టాలి
– శంకర్ గౌడ్ విజయానికి అందరు కృషి చేయాలి
– చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అడ్డంగా దోచుకున్న దొంగ, దగాకోరు.. దోఖేబాజ్ ఎమ్మెల్యే అంటూ బీజేపీ నాయకులు, చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై ద్వజమెత్తారు. రాష్ట్రంలోనే తాండూరుకు చెడ్డపేరు తెచ్చిన ఎమ్మెల్యేను ఎన్నికల్లో బొందపెట్టాలని పిలుపునిచ్చారు.

గురువారం బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తాండూరులో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ గెలుపుకోసం తాండూరు పట్టణంలో ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై నేమూరి శంకర్ గౌడ్‌తో కలిసి ప్రచారం చేశారు. పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తా వద్ద వ్యాపారులను, సామాన్యులను కలిసి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే పాలన చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడికి పాల్పడిందన్నారు. తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలకు చుక్కనీరు ఇవ్వలేదన్నారు. బీజేపీ అమలు చేస్తున్న అభివృద్ధిని తాము చేసినట్లుగా మభ్యపెడుతుందన్నారు.
అదేవిధంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రో బాత్ రెడ్డి ఓ పార్టీ నుంచి గెలిచి స్వార్థం కోసం అధికార పార్టీలో చేరారని అన్నారు. తాండూరును కాలుష్య రహితంగా చేస్తానని ఇచ్చిన హామిని నిలబెట్టుకోలేక పోయారని అన్నారు. స్థానిక యువత కోసం ఏం చేయలేదన్నారు. డ్రగ్స్, శాండ్, ల్యాండ్ మాఫియా, గంజాయి మాఫియాలో తాండూరును ముందు ఉంచుతున్నారని అన్నారు. మాలాంటి వ్యక్తుల వద్ద దోచుకున్న డబ్బును ఖర్చు చేస్తున్నారని అన్నారు. దొంగ, దగా, దోఖేబాజ్ అంటూ ఎమ్మెల్యేపై ద్వజమెత్తారు. బీజేపీ పార్టీపై బురదజల్లే ప్రయత్నం, బీఎల్ సంతోష్ పై మసిపూసేందుకు యత్నించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎన్నికల్లో బొందపెట్టాలన్నారు.
తాండూరు కలుషిత రాజకీయాల్లో మార్పు రావాలంటే జనసేనతో సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్, సీనియర్ నాయకులు మనోహరావు, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, తాండూరు పట్టణ అభ్యర్థి సుదర్శన్ గౌడ్, మహిళ మోర్చ నాయకురాలు అర్చన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

