మనోహర్ రెడ్డితో తాండూరు అభివృద్ధి
– అందుకే ఆయన పట్టం కట్టిన ప్రజలు
– గెలుపుపై హర్షం చేసిన కాంగ్రెస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎమ్మెల్యేగా గెలిచిన బుయ్యని మనోహర్ రెడ్డితో తాండూరు నియోజకవర్గ అభ్యర్థి సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ రవూఫ్ అన్నారు. తాండూరు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి గెలుపుపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం పలువురు నేతలు కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రవూఫ్, కౌన్సిలర్ అబ్దుల్ రజాక్, నాయకులు మసూద్, కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ ఖవి తదితరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత పాలన చేసిందన్నారు. ప్రజలు మార్పు కోరుకుని కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని అన్నారు.
ప్రజల అభీష్టం మేరకు మనోహర్ రెడ్డితో కలిసి నడిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. మంచి వ్యక్తిగా గుర్తింపు పొందిన మనోహర్ రెడ్డి గెలుపుకోసం శ్రమించడం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మనోహర్ రెడ్డిని మెజార్టీతో గెలిపించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి తాండూరులో విద్యా, వ్యాపారం, వైద్యం, ఉపాధి రంగాలలో పురోగతికి కృషి చేస్తారని నమ్మకం ఉందన్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరిచేంఉదకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి గెలుపుకు సహకరించిన వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

