బీజేపీ బలం తగ్గలేదు..!
– రాబోయే రోజుల్లో పుంజుకుంటాం
– ఎంపీ, సర్పంచుల ఎన్నికల్లో సత్తా చూపిస్తాం
– అధికారం కోసం బీఆర్ఎస్ నీచ రాజకీయాలు
– కాంగ్రెస్ హామీలు అమలు కాకుంటే నిలదీతే
– బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ బలం ఏమాత్రం తగ్గలేదని, దేశంలో, రాష్ట్రంలో పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డబ్బు ఆశ చూపి అధికారంలోకి రావాలని నీచరాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ గతంలో కంటే మరింత మెరుగు పడిందన్నారు. 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కామారెడ్డిలో ముఖ్యమంత్రి అభ్యర్థులైనా కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై బీజేపీ అభ్యర్థి వెంకట రమణ విజయం సాధించారని అన్నారు. అదేవిధంగా రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీష్ ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీ హావా కొనసాగిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రధాని నరేంద్రమోడి నాయకత్వంలో మరింత బలంగా పుంజుకుంటామన్నారు. ఎంపీ. సర్పంచుల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా నిలదీస్తామన్నారు. మరోవైపు తాండూరులో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో దిగిన నేమూరి శంకర్ గౌడ్ కు ఓట్లు వేసి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో అభ్యర్థి ప్రకటన ఆలస్యం కావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. అయినా కూడా పోటీ ఇవ్వడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, మండల అధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు, పెద్దేముల్ మండల అధ్యక్షులు సందీప్, మల్లేష్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

