స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కలిసిన వీఎన్ గౌడ్
– పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ అల్లాపురం విశ్వనాథ్ గౌడ్(విఎస్ గౌడ్) కలిశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన సందర్భంగా విశ్వనాథ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను విశ్వనాథ్ గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి.. శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ లకు పదవులు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాండూరు ప్రాంతానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ పుట్టిన ప్రాంతానికి, జిల్లాకు, పదవికి వన్నె తీసుకరావాలని ఆకాంక్షించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను విశ్వనాథ్ గౌడ్ తో పాటు సోమనాథ్ గౌడ్, వికారాబాద్ కు చెందిన మల్లికార్జున్ గౌడ్. తాండూరు నాయకులు హరి హర గౌడ్ తదితరులు కూడా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఇది కూడా చదవండి…

