చెరువులోకి దూసుకెళ్లిన కారు..!

క్రైం తాండూరు తెలంగాణ వికారాబాద్

చెరువులోకి దూసుకెళ్లిన కారు..!
– డ్రైవర్‌కు, ప్రయాణికులకు తప్పిన ప్రాణాయం
– వికారాబాద్‌ జిల్లాలో ఘటన
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : మంచు కారణంగా రోడ్డు కనిపించకగా ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. అందులోని కారు డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు కారులో నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ సంఘటన సోమవారం వికారాబాద్‌ జిల్లా కేంద్రం శివారెడ్డి పేట చెరువు వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు.. హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన పర్యాటకులు ఇక్కడి అనంతగిరికి వచ్చి మరుసటి రోజు తిరిగి వెళుతుంటారు. ఇదే క్రమంలో హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ ను చూసేందుకు కారులో ఐదుగురు స్నేహితులు బయలుదేరారు.

అందులో నలుగురు అబ్బాయిలు కాగా ఒక అమ్మాయి ఉంది. రఘు,మోహన్, సాగర్, గుణశేఖర్ తో పాటు పూజిత కారులో ఉన్నారు. వీకెండ్‌ కావడంతో అనంతగిరి హిల్స్ చూసేందుకు బయలుదేరిన వీరు శివారెడ్డి పేట దగ్గర ఒక్కసారిగా కారు చెరువులోకి దూసుకు వెళ్ళింది. అందులో రఘుకి ఈత రావడంతో సాగర్ మోహన్ పూజితలను సురక్షితంగా రక్షించాడు. గుణశేఖర్ కార్ తో సహా మునిగిపోయాడు. అయితే ప్రస్తుతం గుణశేఖర్ కోసం పోలీసులు రెస్క్యూ చేస్తున్నారు.

మునిగిన కారును బయటకు తీశారు. కారుకి ఇరువైపులా డ్యామేజ్ లు ఉండడంతో వేరే ఏదైనా వాహనాన్ని ఢీకొట్టారా అనే అంశం మీద క్లారిటీ రావాల్సి ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చెరువు వద్దకు చేరుకున్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం