జిల్లాలో నలుగురు ఎస్ఐల బదిలీలు..!

కెరీర్ తాండూరు వికారాబాద్

జిల్లాలో నలుగురు ఎస్ఐల బదిలీలు..!
– తాండూరు ఎస్ఐ అబ్దుల్ రవూఫ్‌కు స్థాన చలనం
– కొత్త ఎస్ఐగా పీ.శంకర్‌ నియామకం
– ఉత్తర్వులు జారీ చేసిన పోలీసు శాఖ
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలో నలుగురు ఎస్ఐలకు స్థానం కల్పించారు. ఈ మేరకు పోలీసు శాఖ జారీ చేసిన ఉత్తర్వులను జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రకటించారు. జిల్లాలోని తాండూరు, బొంరాంస్ పేట్, దౌల్తాబాద్‌ పోలీస్టేషన్‌ల పరిధిలో ఎస్ఐల బదిలీలు జరిగినట్లు వెల్లడించారు. తాండూరు పట్టణ ఎస్ఐ అబ్దుల్ రవూఫ్‌ను బొంరాస్ పేట్ పోలీస్టేషన్‌కు బదిలీ చేయగా.. అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్న పీ.శంకర్‌ను తాండూరు పట్టణ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. దౌల్తాబాద్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న రమేష్‌ను వికారాబాద్ పోలీస్టేషన్‌ ఎస్ఐగా బదిలీ చేశారు. వేయింటింగ్‌లో ఉన్న శ్రీశైలం యాదవ్‌ను దౌల్తాబాద్‌ పోలీస్టేషన్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా తాండూరు పట్టణ ఎస్ఐగా బాధ్యతలు తీసుకునేందుకు పీ.శంకర్‌ అయిష్టత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తాను పనిచేసిన యాలాల పోలీస్టేషన్‌కు వెళ్లేందుకు అసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!