గుమ్మడి గింజలతో కీళ్లకు ప్రాణం..!
– పాలతో కలిపి తింటే ప్రయోజనం
– ఎముకల వ్యాధుల నివారణ ఖాయం
దర్శిని డెస్క్: వృద్ధ్యాప్యం మీద పడుతున్న వారికి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వేధించడం సహజం. నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యులను, ఆయుర్వేద నిపుణులను సంప్రదిస్తుంటారు. అయితే మన ఇంట్లో నుంచి కీళ్లు, మోకాళ్ల నొప్పులకు నివారణ ఔషధాన్ని తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. పాలలో నానబెట్టిన గుమ్మడి గింజలను తినటం వల్ల కీళ్లకు ప్రాణం పోస్తుంది. కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాని నుంచి లభించే మరిన్ని ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం..
గుమ్మడికాయ గింజలు విటమిన్ ఇ, కెరోటినాయిడ్లతో సహా అనేక యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడుతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి, కణాల రక్షణకు, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల వాపు వంటివి దూరం చేస్తుంది.
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం ఎముకల పెరుగుదలకు, బలానికి మంచిది. ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకున్న వ్యక్తులు వారి ఎముకలలో ఖనిజ సాంద్రతను కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఇది ఎముక పగుళ్లు, బోలు ఎముకల వ్యాధి వంటి ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం వల్ల వచ్చే మరో దుష్ప్రభావం రక్తంలో కాల్షియం స్థాయి కూడా తగ్గుతుంది.
100 గ్రాముల గుమ్మడి గింజల్లో 574 కేలరీల శక్తిని, 49 గ్రాముల కొవ్వును, 6.6 గ్రాముల ఫైబర్, 30 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి శక్తిని అందించి అనేక వ్యాధుల నుండి కాపాడుతుంది. వీటిని తీసుకోవడం ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. గుమ్మడి గింజలను పాలతో కలిపి తీసుకుంటే, ఎముకల ఆరోగ్యానికి మేలు చేసే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, జింక్‌లను అందిస్తుంది. ఈ పోషకాలు సమిష్టిగా ఆరోగ్యకరమైన ఎముకల పెరుగుదల, బలం, నిర్వహణకు తోడ్పడతాయి, ఎముక వ్యాధులను నివారించడంలో గుమ్మడికాయ గింజలతో పాలు సహాయకారిగా చేస్తాయి.
ఇది కూడా చదవండి…

