భద్రత తనిఖీలు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

భద్రత తనిఖీలు..!
– రైల్వే స్టేషన్లలో ప్రత్యేక బృందాల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలోని తాండూరు, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో భద్రత తనిఖీలు చేపట్టారు. ఆదివారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు బీడీ టీంతో పాటు డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు ముమ్మరంగా పరిశీలన చేశారు. తాండూరు రైల్వే స్టేషన్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలలో పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చే పోయే ప్రయాణ రైళ్లలో కూడా బోగీలను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాయించనీయ, అనుమానాస్పద ఘటనలకు జరగకుండా అప్రమత్తంగా తనిఖీలు కొనసాగించారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఎక్కడైనా అనుమాస్పద సంఘటనలు, వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. ఈ తనిఖీలలో ఆయా బృందాలతో పాటు రైల్వే పోలీసులు సహకరించారు.

ఇది కూడా చదవండి..

సార్లు వస్తున్నారు..!