మనిషిని ఎత్తుకెళ్లిన కానిస్టేబుల్..!
– 2కిలో మీటర్లు మోసుకుని పరుగు
– అభినందించిన అధికారులు, ప్రజలు
– అసలు సంగతి తెలిస్తే షాక్ అవుతారు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ మరో మనిషిని భుజాన మోసుకుని పరుగెత్తాడు. ఏకండా 2 కిలో మీటర్లు పరిగెత్తి సాహసం చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇంతకు అసలేం జరిగిందో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లాలోని వీణవంక పరిధి భేతిగల్‌లో పొలం వద్ద కుర్ర సురేష్ ఇంట్లో గొడవ పడి పొలం వద్ద పురుగుల సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్నవారు గమనించి 100కు సమాచారం ఇవ్వగా బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోమ్‌గార్డు కిన్నెర సంపత్‌లు అక్కడికి చేరుకున్నారు.
కానిస్టేబుల్ జయపాల్ ఎంతో శ్రమకోర్చి ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. సురేష్‌ను భుజాన వేసుకుని ఏకంగా 2 కిలోమీటర్లు అతన్ని తీసుకెళ్లారు. కుటుంబసభ్యుల సహాయంతో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సురేష్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లతో పాటు ఇతర సిబ్బందిని ఎస్ఐ వంశీకృష్ణ, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు.
ఇది కూడా చదవండి..

