జోష్ పుల్‌గా స్టార్ తల్లీ కూతుళ్ల వేడుకలు
– వాసవి మహిళ సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ
– వివిధ రంగాల్లోని మహిళ మణులకు సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్టార్ తల్లీ కూతుళ్ల సెలబ్రేషన్స్ తాండూరులో జోష్ ఫుల్ గా జరిగాయి. తాండూరు వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ ఆద్వర్యంలో సంఘం సభ్యులతో కలిసి ఈ వేడుకలు నిర్వహించారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉత్సహాంగా స్టార్ తల్లీ కూతుళ్లు అనే పేరుతో ఉత్సవాలు నిర్వహించారు. తల్లీ కూతుళ్ల మద్య ఉండే బంధాలు, అనుబంధాలు తెలిపేలా పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
తల్లీ కూతుళ్లను ఉత్తేజ పరిచేలా పలు పోటీలు నిర్వహించారు. పోటీలో గెలిచిన తల్లీ కూతుళ్లకు స్టార్ కీరీటాలు, బహుమతులు అందజేశారు. అనంతరం రాజకీయ రంగంలో రాణిస్తున్న ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, తెలంగాణలో తాండూరు మున్సిపల్ తొలి చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్యతో పాటు వైద్య, విద్యా, న్యాయవాద రంగాలలో తమదైన విశిష్టతను చాటుకున్న మహిళ ప్రతినిధులను సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథులు కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత శంకర్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ సృష్టిలో తల్లీ కూతుళ్ల బంధం ఎంతో బలమైందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి పాత్రను చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘం సంఘం సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

