రంజాన్ పండగపై ప్రత్యేక దృష్టి
– ఈద్గా, ప్రార్థనా మందిరాల వద్ద భద్రత
– 200ల మంది సిబ్బందితో బందోబస్తు
– వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి
– ఈద్గా మైదానంలో ఏర్పాట్ల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరులో రంజాన్ పండగపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణ శివారు చెన్ గెష్ పూర్ రోడ్డు మార్గంలోని ఈద్గా మైదానంను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సందర్శించారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణ రెడ్డితో కలిసి ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండగ సందర్భంగా తాండూరులో ఏర్పాట్లతో పాటు బందోబస్తుకు దృష్టి సారించడం జరిగిందన్నారు.
ముస్లిం సోదరులు పండగను ప్రశాంతంగా జరుపుకునేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసు, ఏఆర్, ట్రాఫిక్ సిబ్బందితో పాటు ఇతర శాఖల నుంచి దాదాపు 200 మంది సిబ్బందితో ఈద్గా మైదానం, ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తు చర్యలు చె పడుతున్నామన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ముస్లిం సోదరులు రంజాన్ పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని, మత సామరస్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రూరల్, పట్టణ సీఐలు అశోక్ కుమార్, సంతోష్ కుమార్, ఎస్ఐలు విఠల్ రెడ్డి, ఎస్ఐలు విఠల్ రెడ్డి, కాశినాథ్, విద్యుత్ ఏడీ ఆదినారాయణ, ఏఈ రఘువీరారెడ్డి, ఈద్గా కమిటి చైర్మన్ యూసుఫ్ ఖాన్, కమిటి సభ్యులు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

