మజ్జిగ పంపిణీ సేవ అభినందనీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

మజ్జిగ పంపిణీ సేవ అభినందనీయం
– ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి
– మార్వాడి యువమంచ్ మజ్జిగ కేంద్రం ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వేసవిలో పేదల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు బస్టాండ్ సమీపంలో మార్వాడీ యువమంచ్ ఆధ్వర్యంలో ఏడో ఏడాది మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ రెడ్డి హాజరై మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి మజ్జిగ కేంద్రంతో ఉపశమనం కలిగించే సేవలు అందించడం అభినందనీయమని మార్వాడి యువమంచ్ సేవను కొనియాడారు. ప్రజలు ఈ మజ్జిగ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అదేవిధంగా మంచ్ అధ్యక్షులు అనిల్. సార్థా మాట్లాడుతూ మహిళ మండల సహాకారంతో మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, 45 రోజుల పాటు మజ్జిగ పంపిణీ చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు విజయ్ ప్రకాష్ సార్డా, మన్మోహన్ సార్డా, డా.సూర్యప్రకాష్ సోమాని, మహేష్ సార్డా, సన్ని అగ్రవాల్, బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి సచిన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, దినేష్ పర్తాని, అశిష్ సార్డా, సునీల్ సార్డా, మహిళ మండలి అధ్యక్షురాలు సంతోష్ రాఠీ, కార్యదర్శురాలు కిషోరీ గర్రాణి, కరణ్ సార్డా, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ రాము, మంచ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పార్లమెంట్‌ పోలింగ్‌పై స్పెషల్ నజర్