రైతులకు పంటనష్ట పరిహారం ఇప్పిస్తాం..!
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఎమ్మెల్యేను సన్మానించిన ఏఎంసీ పాలకవర్గం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా తన వంతు కృషి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం కు 6 నేలలు పదవి కాలం పొడిగించడం పట్ల తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అధ్వర్యంలో పాలకర్గ సభ్యులు ఘనంగా సన్మానం చేయడం జరగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు మాట్లాడుతు అకాల వర్షాలతో మినుములు, పెసర, కంది, పత్తి పంటలు నష్టం పోయిన రైతులకు ప్రభుత్వం తరుపు నుండి వారికి నష్ట పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తాని పేర్కొన్నారు. అదేవిధంగా తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవి కాలాన్ని 6 నెలలు పొడగించినందుకు ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటామన్నారు. దీంతో పాటు సీఎం కేసీఆర్ రైతులుకు రైతు బీమా, రైతు బంధు, రైతుల కోసం కొనుగోళ్లు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ వెంకట్ రెడ్డి, తాండూరు మార్కెట్ కమిటీ డైరక్టర్లు కట్కం వీరేందర్, దినేష్ సింగ్ ఠాకూర్,భీమ్ రెడ్డి, మలప్ప తదితరులు పాల్గొన్నారు.
