రిజర్వేషన్‌లపై టెన్షన్..!
– ఏ వార్డుకు ఏది వస్తోందో..?
– ఓటర్ల తారుమారుతో ఆశావాహుల్లో గుబులు
– ఆబ్జెక్షన్స్‌పై అధికారుల స్పందన సస్పెన్స్
– అభ్యంతరాలకు నేడే లాస్ట్ చాన్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో పుర సమరం వేడెక్కుతోంది. ఎన్నికల సందర్భంగా పోటీకి సై అంటూ ఆశావాహులు రంకెలేస్తున్నారు. కాని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ప్రకటించిన ముసాయిదా జాబితా వారిని టెన్షన్ పెడుతోంది.

జాబితాలో ప్రకటించిన వార్డుల్లో ఓటర్లు జనాలకు మించి ఉండడంతో ఆందోళనకు గురవుతున్నారు. పట్టణంలోని 36 వార్డులు ఉండగా ప్రతి వార్డు నుంచి ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు వెలువెత్తుతున్నాయి. గతంలో ఉన్న ఓటర్ల కంటే ఒక్కో వార్డులో సుమారు 300ల నుంచి 500ల వరకు ఓటర్లు పెరగడం ఆశావాహులను కలవరపెడుతోంది. తమ వార్డులో ఇతర వార్డులకు చెందిన ఓటర్లను చేర్చారంటూ అభ్యంతరాలు చెబుతూ ఫిర్యాదులు చేస్తున్నారు.

ముసాయిదా జాబితాలో ఓటర్లను మార్చకపోతే వార్డుల రిజర్వేషన్లు మారే అవకాశం ఉందని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే వారి వారి వార్డుల్లో ఉన్న ఓటర్లపై లెక్కలు వేసుకుని.. తమకు అనుకూలంగా రిజర్వేషన్లు రావచ్చని ఆశాభావంతో ఉన్నారు. ఇప్పుడు కొత్త ఓటర్లు, బోగస్, డబుల్ ఓటర్లు జాబితాలో కనిపించడంతో అయోమయానికి గురవుతున్నారు. తమ వార్డులో రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోతే ఆశలు గల్లంతు అవుతాయనే ఆందోళన చెందుతున్నారు.
ఆబ్జెక్షన్స్ ఫిర్యాదులపై సస్పెన్స్
ఈనెల 1న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ముసాయిదా జాబితాను ప్రకటించారు. నోటికేషన్ ఉత్తర్వులలో భాగంగా ఈనెల 4వ తేది వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

దీంతో తాండూరు పట్టణంలోని పలు వార్డులకు చెందిన మాజీ కౌన్సిలర్లు, ఆశావాహులు రెండో రోజు నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే వచ్చిన అభ్యంతరాలపై అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితలు కనిపించడం లేనట్లుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు ఓటరు జాబితాలో మార్పులు చేసేందుకు అధికారులకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఓటరు జాబితాపై అభ్యంతరాలు తెలిపేందుకు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చారు. దీని తరువాత ఎలాంటి పరిణాలు చోటు చేసుకుంటాయో ఆసక్తికరంగా మారింది.

ఇదికూడా చదవండి…

