
కరెంటుకు కాడెద్దు బలి..!
– కన్నీరు పెట్టుకున్న రైతన్న
– పెద్దేముల్ మండలంలో ఘటన
పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : కరెంటు షాక్తో ఓ కాడెద్దు మృత్యువాత పడింది. ఎద్దు మృతితో రైతున్న కన్నీరు పెట్టుకున్నాడు. ఈ సంఘటన గురువారం పెద్దేముల్ మండలం కందనెల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన బోయిని చిన్న మొగులప్ప తనకున్న పొలంతో పాటు ఇతరుల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

రూ ₹1,80,000 వెచ్చించి జోడెద్దులను కొనుగోలు చేశాడు. గురువారం సాయంత్రం గ్రామ శివారులోని ఓ రైతు పొలం చుట్టూ వేసిన కంచేకు విద్యుత్ తీగ తగిలింది. ఎద్దు మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంకు గురై అక్కడికక్కడే మృత్యువాత పడింది.

మరో ఎద్దు ప్రాణాల నుంచి బయటపడింది. పొలం పనులు జోరుగా సాగుతున్న సమయంలో ఎద్దు మృతి చెందడం పట్ల రైతు కుటుంబ సభ్యులు బోరున వినిపించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమను ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

ఇదికూడా చదవండి…

