వైభోగంగా బీరప్ప స్వామి విగ్రహా ప్రతిష్ఠాపన

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభోగంగా బీరప్ప స్వామి విగ్రహా ప్రతిష్ఠాపన
– దేవాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు
– బోనాలతో మహిళ భక్తుల ఊరేగింపు
– దర్శించుకున్న నేతలు, కురుమ సంఘం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని బీరప్పస్వామి దేవాలయంలో స్వామి వారి విగ్రహ ప్రతిష్టాతపన ఉత్సవాలు అంగరంగ వైభోగంగా జరిగాయి. దేవాలయ కమిటి, తాండూరు నియోజకవర్గ కురుమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వారి విగ్రహా ప్రతిష్టాతపన ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం దేవాలయంలో బీరప్ప స్వామి కళ్యాణోత్సవం కమణీయంగా జరిగింది. కురుమ సంఘం పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, పార్టీ నాయకులు, కురుమ సంఘం నాయకులు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా మహిళ భక్తులు తమ ఇండ్ల నుంచి బోనాలతో ఊరేగింపుగా దేవాలయానికి చేరుకున్నారు. దేవాలయం చుట్టూ ప్రదక్షణలు చేసి స్వామికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

బోనాల ఊరేగింపు ముందు పోతురాజుల విన్యాసాలు, ఒగ్గు కళాకారుల వాయిద్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిష్టాపన ఉత్సవాలతో దేవాలయం కిక్కిరిసి పోయింది. పలువురు దాతలు దేవాలయ అభివృద్ధికి విరాళాలు అందజేశారు.

మరోవైపు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహాకారంతో దేవాలయం వద్ద బోరు మోటారు వేయించేందుకు కృషి చేస్తామని బీజేపీ నాయకులు యు.రమేష్‌ కుమార్ అన్నారు. అదేవిధంగా దేవాలయ అభివృద్ధికి తనవంతు సహాకారం అందిస్తామని అన్నారు.
kvcs
ఈ కార్యక్రమంలో కురుమ సంఘం సభ్యులు భావనోళ్ల హన్మయ్య, రిటైర్డ్ ఉద్యోగి హన్మయ్య, న్యాయవాది కె.గోపాల్, పూజారి పాండు, జినుగుర్తి నర్సింలు, చీమల నర్సింలు, మహిపాల్, గౌడి వెంకటేషం, గౌడి సత్యం, గౌడి రాము, నాగారం జగదీష్, నాగారం మల్లేశం, తోపాజీ రమేష్, మరాఠీ నర్సింలు, మిట్టి మహేష్, మిట్టి శ్రీశైలం, ఇందూరు మల్లేశం, బిజ్జారం కిష్టప్ప, ఖాంజాపూర్ శ్రీశైలం, శ్రీనివాస్, మాణిక్ రావు, రమేష్, ఇందూరు బాలు, దోమ శ్రీశైలం, మంబాపూర్ రాజు, బొంబాయి శివరాజ్, పల్లె వెంకటయ్య, మాజీ కౌన్సిలర్ బాలప్ప, మాజీ సర్పంచ్ కుర్వ బాలప్ప, కాశింపూర్ మల్లేశం, దోమ భీమయ్య, గోపాలకృష్ణ, సతీష్, పగిడ్యాల శేఖర్, దాతలు జనగామ పెద్ద నర్సప్ప, చుక్క గోపాల్, రిటైర్డ్ ఉద్యోగి బండ హన్మయ్య, కుమారులు, ఏఎస్ఐ వెంకట రమణ, నర్సింలు, బీజేపీ నాయకులు బంటారం భద్రేశ్వర్, దోమ కృష్ణ, మంతటి రాజు, సందీప్, తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన కురుమ సంఘం పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బుయ్యని బ్రదర్స్