మున్సిప‌ల్ ఆస్తుల‌ను స‌ర్వే చేయించండి

తాండూరు వికారాబాద్

మున్సిప‌ల్ ఆస్తుల‌ను స‌ర్వే చేయించండి
– స‌ర్వేనెంబ‌ర్ 52 భూముల‌పై ఆర్డీఓకు కౌన్సిల‌ర్ల విజ్ఞ‌ప్తి
తాండూరు, ద‌ర్శ‌ని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలోని మున్సిప‌ల్ ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆర్డీఓ, మున్సిప‌ల్ ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్‌ను కౌన్సిల‌ర్లు కోరారు. బుధ‌వారం మున్సిప‌ల్‌కు చెందిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన 21 మంది కౌన్సిల‌ర్లు ఇంచార్జ్ క‌మీష‌న‌ర్ అశోక్ కుమార్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. ప‌ట్ట‌ణంలోని స‌ర్వేనెంబ‌ర్ 52లో మున్సిప‌ల్‌కు చెందిన విలువైన భూములు ఉన్నాయ‌ని, వాటిని స‌ర్వే చేయించాల‌ని ఇంచార్జ్ క‌మీష‌న‌ర్‌కు అందించిన విన‌తిప‌త్రంలో పేర్కొన్నారు. అట్టి స‌ర్వేనెంబ‌ర్‌లో స‌ర్వే చేయించి మున్సిప‌ల్ భూముల‌ను కాపాడాల‌ని కోరారు. ఇంచార్జ్ క‌మీష‌న‌ర్‌కు విన‌తిప‌త్రం అందించిన వారిలో మున్సిప‌ల్ మాజీ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల ర‌త్నమాల న‌ర్సింలు, సీనీయ‌ర్ కౌన్సిల‌ర్లు ప‌ట్లోళ్ల నీర‌జా బాల్‌రెడ్డి, అబ్దుల్ ర‌జాక్, ప్ర‌వీణ్ గౌడ్, బోయ‌ర‌వి, రాము, అస్లాం, బీజేపీ కౌన్సిల‌ర్లు అంతారం ల‌లిత‌, సాహు శ్రీ‌ల‌త‌, సంగీత ఠాకూర్, బంటారం లావ‌ణ్య‌, బాల‌ప్ప‌, కాంగ్రెస్ కౌన్సిల‌ర్ మ‌ధుబాల త‌దిత‌రులు ఉన్నారు.