రేషన్ బియ్యం తరలిస్తున్న ఆటో డ్రైవర్‌పై కేసు
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి: అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ ఆటో డ్రైవర్‌పై బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన ఎండి ఆజీమ్ గురువారం మధ్యాహ్నం మండల పరిధిలోని కొర్విచేడ్ నుంచి ఆటో(ఎపీ22X3682)లో దాదాపు 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఆటోతో పాటు డ్రైవర్ అజీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బషీరాబాద్ ఆర్ఐ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించిన అనంతరం ఆయన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
