మెరుగైన పాలన అందించండి..!
– సబ్ కలెక్టర్ తో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భేటీ
– తాండూరు అభివృద్ధి విషయాలపై చర్చ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు డివిజన్ అభివృద్ధి కోసం మెరుగైన పాలన అందించాలని సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ను స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. తాండూరు ఆర్డీఓ కార్యలయ స్థాయి పెరిగి సబ్ కలెక్టర్ హోదాలోకి రావడంతో తాండూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఉమా శంకర్ ప్రసాద్ తో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కార్యాలయంలో జరిగిన ప్రజా పాలన దినోత్సవం అనంతరం సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమావేశం అయ్యారు. తాండూరుకు చెందిన నేతలను సబ్ కలెక్టర్ కు పరిచయం చేశారు.
అనంతరం తాండూరు డివిజన్ అభివృద్ధికి సంబంధించిన విషయాలపై చర్చించారు. తాండూరు ఆర్డీఓ స్థాయి పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ప్రజలుకు మెరుగైన పాలన అందే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, నాయకులు కరణం పురుషోత్తం రావు, అబ్దుల్ రవూఫ్, మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్, ఉత్తమ్ చంద్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, విజయ దేవి, ప్రభాకర్ గౌడ్, బోయరవి, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కావలి సంతోష్ కుమార్, యువనాయకులు, నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

