నేడు హుజూరాబాద్‌కు సీఎం కేసీఆర్..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

– అక్క‌డే దళిత‌బంధు పథకానికి శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేడు హుజూరాబాద్‌కు విచ్చేస్తున్నారు. తెలంగాణ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు. నేడు మధ్యాహ్నం 1 గంటకు ఎర్రవెల్లి ఫాంహౌజ్ నుంచి సీఎం కేసీఆర్ హుజురాబాద్ బయలుదేరి.. మధ్యాహ్నం 1:40 గంటలకు సభా స్థలికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు శాలపల్లిలో గ్రామంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అనంత‌రం సీఎం కేసీఆర్ ద‌ళిత బంధుకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. ముందుగా 15 మంది లబ్ధిదారులతకు సీఎం కేసీఆర్ స్వయంగా చెక్కులను పంపిణీ చేయనున్నారు. దళిత పథకం అమలు చేసే తీరును, దాని వల్ల కలిగే ప్రయోజాల గురించి ప్రజలకు వివరించనున్నారు. మ‌రోవైపు త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు భారీగా జన సమీకరణ చేపట్టారు. దాదాపు లక్ష మందితో నిర్వహించనున్న ఈ సభ ఏర్పాట్ల‌ను మంత్రి హ‌రీష్ రావు ప‌ర్య‌వేక్షించారు.