వివాహా వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
– నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు రాజుగౌడ్ వారి సోదరుడి వివాహా వేడుకలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌లు హాజరయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని బాలాజీ కన్వెన్షన్ హల్లో రాజుగౌడ్ తమ్ముడి వివాహాం జరిగింది. ఈ వివాహా వేడుకకు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌లు హాజరై నూతన వధూ వరులను
ఆశీర్వదించారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారి సోదరుడు నర్సింహ రెడ్డి(బాబు), తాండూరు టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అప్పు(నయూం), పార్టీ ముఖ్యనాయకులు, మిత్రులు పాల్గొన్నారు.
