పులే.. వచ్చిందీ…!
– ఎద్దుపై దాడితో నిర్దారణ
– సమీప ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
– అటవీ, పోలీసు అధికారుల సూచన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో పులి సంచారం జరుగుతున్నట్లు నిర్దారణ అయ్యింది. బుధవారం యాలాల మండలం రేళ్లగడ్డ తాండాలో ఎద్దుపై దాడి జరిగిన సంఘటనతో వెలుగులోకి వచ్చింది. తాండాకు చెందిన మూడావత్ గోప్యా నాయక్ పొలంలో ఉన్న ఎద్దుపై దాడి చేయడంతో అది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మండలంలో తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, యాలాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డీఎఫ్‌ఓ పొలంలో ఉన్న జంతువు పాద ముద్రలను పరిశీలించి చిరుతపులికి చెందినవిగా గుర్తించారు.
ఎద్దుపై దాడి చేసింది చిరుతపులిగా నిర్దారించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు సమీప ప్రాంత ప్రజలకు జాగ్రత్తలు సూచించారు. ప్రజలెవ్వరు ఒంటరిగా అడవి వైపు వెళ్లొద్దని తెలిపారు. పశువులు, మేకలును పొలాల వద్ద, బావుల వద్ద కట్టేసి ఉంచారాదన్నారు. మహిళలు, పురుషులు, చిన్నారులు తెల్లవారు జాము సమయంలో బహిర్భూమికి చెట్ల పొదల్లోకి వెళ్లరాదని సూచించారు. చీకటి పడిన తరువాత ఇంటి నుంచి బయటకు రావద్దని, ఇంట్లోనే ఉండాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

