మరో ఆరుగురు పేకాట రాయుళ్లపై కేసు
– వెల్లడించిన తాండూరు పట్టణ పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో మరో ఆరుగురు పేకాట రాయుళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా టాస్ఖ్ ఫోర్స్ పోలీసులు యాలాల మండల పరిధి తాండూరు పట్టణ శివారు మార్కండేయ కాలనీలో 7 మందిపై కేసు నమోదు చేసినంది సంగతి తెలిసిందే. అదేవిధంగా తాండూరు పట్టణ పోలీస్టేషన్ పరిధి అంతారం గ్రామంలో కూడా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన 6గురు వ్యక్తులు ఊరు బయట పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 10వేల 90లు, సెల్ ఫోన్‌లు, పేకాట ముక్కలు స్వాదీనం చేసుకుని పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదికూడా చదవండి…

