ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..!

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ వికారాబాద్ హైదరాబాద్

ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..!
– రేపటి నుంచి పరీక్ష చెల్లింపుకు అవకాశం
– అపరాద రుసుం గడువు ఎప్పటి వరకు అంటే..?
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. నవంబర్‌ 6 నుంచి 26 వరకు పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. రూ.1000 అపరాద రుసుంతో నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 4 వరకు చెల్లించవచ్చు. ఫస్టియర్‌, సెకెండియర్‌ జనరల్‌ విద్యార్థులు రూ.520, ఒకేషనల్‌ విద్యార్థులు రూ.750 చెల్లించాలని బోర్డు తెలిపింది. సెకెండియర్‌ జనరల్‌ ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.520, సెకెండియర్‌ జనరల్‌ సైన్స్‌ విద్యార్థులు రూ.750 చెల్లించాలని స్పష్టం చేసింది.

పరీక్ష ఫీజు వివరాలివే..
* ఫస్టియర్‌ జనరల్ కోర్స్ అభ్యర్థులు రూ.520/-
* ఫస్టియర్‌ ఒకేషనల్ కోర్స్ – ప్రాక్టికల్స్ తో అభ్యర్థులు రూ.750
* సెకండియర్‌ జనరల్ కోర్స్ ఆర్ట్స్ అభ్యర్థులు రూ.520
* సెకండియర్‌ జనరల్ కోర్స్ సైన్స్ అభ్యర్థులు రూ.750
* సెకండియర్‌ ఒకేషనల్ కోర్స్ అభ్యర్థులు (థియరీ+ప్రాక్టికల్స్‌) రూ.750గా నిర్ణయించారు.

ఇదికూడా చదవండి…

విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి