గ్రూప్-3కి మళ్లీ సగం మంది గైర్హాజరు
– రెండో రోజు 43.82శాతం నమోదు
– పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో రెండో రోజు సోమవారం జరిగిన గ్రూప్-3 పరీక్షకు మళ్లీ సగం మంది అభ్యర్థులు గైర్హాజరు అయ్యారు. గ్రూప్-3 పరీక్షలను దృష్టిలో ఉంచుకుని తాండూరులో 11 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం రెండు విభాగాలుగా పరీక్ష జరగగా సోమవారం మూడో వి భాగంకు సంబంధించి పరీక్ష జరిగింది. 11 పరీక్షా కేంద్రాలలో మొత్తం 3215 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. కాని 1806 మంది గైర్హాజరుతో 1409 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. మరోవైపు తాండూరులోని పరీక్షా కేంద్రాలను సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లను పరిశలించారు. ఆయన వెంట ఆర్డీఓ కార్యాలయ అధికారి మాణిక్ రావు, పరీక్ష నిర్వహణ బృందం అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఇదికూడా చదవండి…

