రేణుకా ఎల్లమ్మ సేవలో ఎమ్మెల్సీ

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

రేణుకా ఎల్లమ్మ సేవలో ఎమ్మెల్సీ
– పూజలు నిర్వహించిన మహేందర్ రెడ్డి
– సన్మానించిన ఆలయ కమిటి సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం నెహ్రు గంజ్లో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ సేవలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తరించారు. ఆలయంలో కొనసాగుతున్న జాతర ఉత్సవాలలో భాగంగా శనివారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు భక్తులు. ప్రజలపై మెండుగా ఉండాలని ప్రార్థించారు. అందరు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం జాతర ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని ఆలయ కమిటి సభ్యులు, సంఘాల సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ వెంట డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు బాల్ రెడ్డి, కౌన్సిలర్ రాము, సర్పంచ్ మేఘనాథ్ గౌడ్, నాయకులు బోయ రాజు, కేశవరావు, కిరణ్ పటేల్, బిర్కడ్ రఘు, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, గంజ్ హమాలి కార్మిక సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.