కంత్రి కేటుగాడు…!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

కంత్రి కేటుగాడు…!
– ఏటీఎం డబ్బుల డ్రాలో మోసం
– సాయం కోరిన మహిళకు కుచ్చుటోపీ
– నకిలీ కార్డు ఇచ్చి ఒరిజన్‌ కార్డుతో జంప్‌
– కాసేపటికే అకౌంట్లో నగదు మాయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏటిఎం నుంచి డబ్బులు డ్రా చేసేందుకు సాయం కోరిన ఓ మహిళకు కంత్రి కేటుగాటు కుచ్చుటోపి పెట్టాడు. ఆమెకు చెందిన అసలైన ఏటీఎం కార్డును మార్చి నకిలీ ఏటీఎం కార్డును అంటగట్టి జంప్‌ అయ్యాడు. కాసేపటికే మరో ఏటీఎం వద్ద ఆమె ఖాతాలోని నగదును లూటీ చేశాడు. అయ్యో పాపం అనిపించిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరానగర్‌కు చెందిన శోభ వెంకటేశ్వర పొదుపు సంఘంలో సభ్యురాలుగా ఉంది. ఇటీవలే ఆమెకు పొదుపు సంఘం నుంచి డబ్బులు వచ్చాయి. సోమవారం పట్టణంలోని మల్లప్ప మడిగ సమీపంలో ఉన్న యూనియన్ బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లింది.

ఉదయం 11 గంటల ప్రాంతంలో బ్యాంకులో ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లింది. ఆమెకు ఏటీఎం నుంచి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలియక అక్కడే ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని సాయం కోరింది. తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును అతనికి ఇవ్వడమే కాకుండా ఏటీఎం పిన్‌ నెంబర్ కూడా చేప్పేసింది. ఇదే చాన్స్‌గా బావించిన కేటుగాడు డబ్బులు డ్రా చేస్తన్నట్లు నటించాడు. ఖాతాలో డబ్బులు లేవని నమ్మించి ఆమెకు ఏటీఎం కార్డును తిరిగి ఇచ్చే క్రమంలో ఒరిజినల్ కార్డుకు బదులు తన వద్ద ఉన్న పనికిరాని నకిలీ ఏటీఎం కార్డును ఇచ్చాడు. ఇద్దరు బయటకు రాగానే కేటుగాటు అక్కడి నుంచి జంప్ అయ్యాడు. కొద్ది సేపటికే శోభ ఖాతాలో నుంచి రూ. 25వేలు డ్రా అయినట్లు మేసేజ్ వచ్చింది. తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును పరిశీలించగా నకిలీ కార్డుగా గుర్తించింది.

వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించి జరిగిన విషయాన్ని తెలిపింది. ఇందుకు అధికారులు ఏమి చేయలేమని చెప్పడంతో లబోదిబో మంది. బ్యాంకుకు ఖాతా పుస్తకాలను అందించి తన అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించుకుంది. తన ఖాతాలో మొత్తం రూ. 45వేలు ఉండగా రూ. 25వేలు డ్రా చేసుకోవడంతో రూ. 20వేలే మిగిలి ఉన్నాయని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు శోభ పరిస్థితిపై అయ్యో అంటూ విచారం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి…

కేవీసీఎస్‌లో అట్టహాసంగా కమ్యూనిటీ హెల్పర్ డే