బ్యాంకుల పనిదినాలు 17 రోజులే
– వచ్చేనెలలో భారీగా సెలవుదినాలు
దర్శిని బ్యూరో : వచ్చేనెల నవంబర్ నెలలో బ్యాంకులకు వరుస హాలీడేస్ వచ్చాయి. ఈనెలలో 17 రోజులు బ్యాంకులలో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. ఈ నెలలో పూర్తిగా ఫెస్టివల్ సీజన్ నడుస్తోన్న కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు వారంలో ఐదు రోజులు సెలవులు వచ్చాయి. దీపావళి.. భాయ్ దూజ్ వంటి పండగలతో దేశం మొత్తంలో ఉన్న బ్యాంకులకు వరుస హాలీడేస్ వచ్చాయి. ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. అయితే కొన్ని జాతీయ సెలవులు మినహా.. శని, ఆదివారాలు ఉండనున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా బ్యాంకుల సెలవులలో మార్పులు రావచ్చు. దీంతో ఏదైనా పని మీద బ్యాంకులకు వెళ్లేవారు ముందుగానే బ్యాంకు హాలీడేస్ తెలుసుకొని వెళ్లడం కరెక్ట్.
నవంబర్‌లో వచ్చే సెలవులివే
నవంబర్ 1: కన్నడ రాజ్యోత్సవ / కుట్ – బెంగళూరు, ఇంఫాల్
వంబర్ 3: నరక చతుర్దశి – బెంగళూరు
నవంబర్ 4: దీపావళి అమావాస్య (లక్ష్మీ పూజ)/దీపావళి/కాళీ పూజ
నవంబర్ 5: దీపావళి (బలి ప్రతిపాద) / విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్ డే / గోవర్ధన్ పూజ
నవంబర్ 6: భాయ్ దూజ్/చిత్రగుప్త్ జయంతి/లక్ష్మీ పూజ/దీపావళి/నింగోల్
వారాంతాల్లో కొన్ని రోజులు మూసి ఉంచే బ్యాంకులు:
నవంబర్ 7: ఆదివారం
నవంబర్ 13: నెలలో రెండవ శనివారం
నవంబర్ 14: ఆదివారం
నవంబర్ 19: గురునానక్ జయంతి (హైదరాబాద్ సహా దాదాపు అన్ని రీజియన్లలో సెలవు)
నవంబర్ 21: ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)
నవంబర్ 22: కనకదాస జయంతి (బెంగళూరు)
నవంబర్ 23: సెంగ్ కుత్స్‌నెమ్ (షిల్లాంగ్)
నవంబర్ 27: నాలుగో శనివారం (అన్ని రీజియన్లలో సెలవు)
నవంబర్ 28: ఆదివారం (అన్ని రీజియన్లలో సెలవు)