టీయూడబ్ల్యూజే ఐజేయూలోకి సీనీయర్ పాత్రికేయులు

తాండూరు రాజకీయం వికారాబాద్

టీయూడబ్ల్యూజే ఐజేయూలోకి సీనీయర్ పాత్రికేయులు
– సభ్యత్వాన్ని అందజేసిన ఐజేయూ నేతలు
– త్వరలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కార్యచరణ
– రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి
తాండూరు, దర్శిని ప్రతినిధి : టీయూడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్టుల యూనియన్లోకి తాండూరు సీనీయర్ పాత్రికేయులు చేరారు. ఆదివారం టీయూడబ్ల్యూజే ఐజేయూ తాండూరు డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో యూనియన్ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారి సమక్షంలో టీయూడబ్ల్యూజే 143 యూనియన్ కు చెందిన తాండూరు సీనీయర్ పాత్రికేయులు కొనింటి ప్రభాకర్, లింగేష్, కృష్ణ, ఏబీన్ నర్సింలులు జాయిన్ అయ్యారు.

వారికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగా సభత్వాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్టుల యూనియన్లలో బలమైన యూనియన్గా ఏర్పడిందన్నారు. అదేవిధంగా తాండూరులోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐజేయూ యూనియన్ తరుపున కార్యాచరణ ఉంటుందని, త్వరలోనే తాత్కాళిక ప్రెస్ భవన్ ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాంచెందర్, కరణం భీంసేన్ రావు, నరేందర్(లిట్టు), శివానంద్ సింగ్ లు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కోటేశ్వర దేవాయలానికి రూ. 10లక్షలు