వంద శాతం వసూళ్లే లక్ష్యం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వంద శాతం వసూళ్లే లక్ష్యం..!
– ఆస్తి, నల్లా, ట్రేడ్ లైసెన్స్ లపై దృష్టి పెట్టాలి
– మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి
– వార్డు ఆఫీసర్లు, ఆర్పీలతో సమీక్ష సమావేశం
తాండూరు, దర్శిని ప్రతినిధి : వంద శాతం వసూళ్లే లక్ష్యంగా పనిచేయాలని తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, మహిళ సంఘాల ఆర్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ ఆస్తి పన్నుల వసూళ్లలో వెనుకబాటుకు గురైందని తెలిపారు. ఆర్థిక సంవతర్సానికి ముందే లక్ష్యాన్ని చేరుకునేందుకు వంద శాతం వసూళ్లను చేపట్టాలన్నారు.

ఆస్తి పన్నులు, కుళాయి పన్నులు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వంద శాతం రాబట్టేలా పనిచేయాలన్నారు. సెలవు దినాల్లో కూడా పనిచేసి లక్ష్యాన్ని సాధించాలన్నారు. అదేవిధంగా పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా దృష్టిసారించాలన్నారు. ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

మరోవైపు విధుల్లోకి వచ్చిన వార్డు ఆఫీసర్లకు దశల వారిగా బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని కమీషనర్ తెలిపారు. త్వరలో వార్డులలో కార్యాలయాలు ప్రారంభించి అక్కడి నుంచే సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్వో అశోక్ కుమార్, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

విద్యతోనే భవిష్యత్తు, గుర్తింపు..!