కొబ్బరి నీళ్లలో పోషకాలు..!
– బరువు తగ్గేందుకు ప్రత్యామ్నాయం
– డయాబెటీస్‌కు సూపర్ మెడిసిన్
దర్శిని డెస్క్ : ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా, నీరసంగా అనిపించినా, వేడి చేసినట్లుగా ఉన్నా.. అందరికీ ఠక్కున గుర్తొచ్చేవి కొబ్బరి నీళ్లు. లేత కొబ్బరి బొండాంలో నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అలసటను కలిగించవు. ప్రతిరోజూ ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగడం వల్ల అలసట, బలహీనత నుండి ఉపశమనం పొందవచ్చు. కొబ్బరి నీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది, కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. 250 ml కొబ్బరి నీటిలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 2 గ్రాముల ప్రోటీన్, 10 శాతం – విటమిన్ సి, 15 శాతం – మెగ్నీషియం, 17 శాతం – మాంగనీస్, 17 శాతం – పొటాషియం, 11 శాతం సోడియం, 6 శాతం కాల్షియం ఉంటాయి. కొబ్బరి నీటిలోని కాల్షియం ఎము కల్ని, పళ్ళను దఢంగా ఉంచి, కండరాల బలోపేతానికి సహకరిస్తుంది. శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయిన ప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది.
బరువు తగ్గడానికి కొబ్బరి నీళ్లకు ప్రత్యామ్నాయం లేదు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని అంశాలు అందుతాయి. దీని నీరు పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు అతిగా తినకుండా ఉండగలరు. అందువల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. సూర్యకాంతి, వేడి కారణంగా కొన్నిసార్లు డీహైడ్రేషన్ సమస్య ఉండవచ్చు. దీంతో అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎలక్ట్రోలైట్స్ వెంటనే అందుతాయి. ఇందులో నీటి లోపం అదుపులో ఉంటుంది. వెంటనే తలనొప్పి సమస్యను నయం చేయవచ్చు. డయాబెటిక్ రోగులకు కొబ్బరి నీరు చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. నిజానికి ఇన్సులిన్ లోపం వల్ల మధుమేహం వస్తుంది. కొబ్బరి నీరు ఇన్సులిన్ పెంచడానికి పని చేస్తుంది. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిదని భావిస్తారు.
కొబ్బరి నీళ్లు తాగేందుకు సరైన సమయం
కొబ్బరి నీళ్లను ఉదయాన్నే పరిగడుపున తాగడం వల్ల చలవ చేస్తుంది. ఎక్కువగా వేడి చేసినట్లు ఉన్నట్లయితే ఇలా పొద్దున్నే తాగడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి స్వాంతన లభిస్తుంది. నిద్ర పోయే ముందు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మానసికంగా మనం మెరుగ్గా ఉంటాం. ఆందోళన, ఒత్తిడి లాంటివి తగ్గుతాయి. మెదడు ప్రశాంతంగా మారుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. ముఖ్యంగా మూత్ర నాళంలో ఉన్న విష పదార్థాలన్నీ సమర్థవంతంగా తొలగిపోతాయి.
ఇదికూడా చదవండి…

