శుభప్రద్ పటేల్‌కు సన్మానం
– సన్మానించిన కోట్రిక విజయలక్ష్మీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్‌ను తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య సన్మానించారు. ఆదివారం తాండూరుకు వచ్చిన కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ కోట్రిక విజయలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ కోట్రిక విజయలక్ష్మీ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోట్రిక విజయక్ష్మీ శుభప్రద్ పటేల్‌ను శాలువా సత్కరించి భగవద్గీత పుస్తకాన్ని బహుకరించారు. బీసీ కమీషన్ మెంబర్‌గా తాండూరు ప్రాంత బీసీల సమ్యల పరిష్కారానికి కృషి చేయాలని కోట్రిక విజయలక్ష్మీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కోటం సిద్దలింగం, తెలంగాణ ఉద్యమకారులు జిలాని, భాను, దత్తాత్రేయ తదితరులు ఉన్నారు.

