అక్రమ వలసదారులను బహిష్కరించండి
– రోహింగ్యాలు, బంగ్లాదేశీయులను, పాకిస్తానీయలపై చర్యలు తీసుకోండి
– తాండూరు బీజేపీ నేతల డిమాండ్, పోలీసులకు ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో తాండూరులో ఉంటున్న అక్రమ వలసదారులను బహిష్కరించాలని స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం కేంద్రం ఆదేశాల మేరకు బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో పార్టీ నేతలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాండూరులో రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తాన్ మూలాలు కలిగిన ఆక్రమ వలసదారులు ఉన్నట్లు అనుమానాలను వ్యక్తం చేశారు. వారు దేశ వ్యతి రేకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున వారిని గుర్తించి పట్టణం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, మాజీ కౌన్సిలర్ బాలప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

