కాంగ్రెసోళ్లది కడుపు మంటే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెసోళ్లది కడుపు మంటే..!
– రజతోత్సవ విజయంతో వణుకు
– ఎన్ని కుట్రలు చేసినా సభ సక్సెస్
– సభ గురించి మాట్లాడే హక్కు మీకెక్కడిది
– చేతగాని ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులోస్తాయ్
– త్వరలో లక్షల మందితో కేసీఆర్ సభలు
– కాంగ్రెస్ కామెంట్లను ఖండించిన బీఆర్ఎస్ నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభ విజయవంతంపై కాంగ్రెస్ వాళ్ల కడుపు మండిందని, చేతగాని ప్రభుత్వాన్ని విమర్శించడం మింగుడు పడలేక వాఖ్యలు చేస్తున్నారని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి, కోహీర్ శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీంలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభపై కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ లు చేసిన వాఖ్యలను ఖండించారు. 11 నెలల పాలనపై వ్యతిరేకతతో సీఎం కేసీఆర్ ను చూసేందుకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తే అందులో సగం మంది కూడా రారని, దమ్ముంటే సభ పెట్టి నిరూపించుకోవాలన్నారు. సభలో కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన హామిలను మాత్రమే ప్రశ్నించారని. రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, తదితర హామీలను విస్మరించిందని ప్రశ్నిస్తే కాంగ్రెస్ వాళ్లకు మింగుడు పడలేదన్నారు. కాంగ్రెస్ వాళ్లపై పగతో సభను పెట్టలేదని, అమలు చేయని హామిలను మాత్రమే ప్రశ్నించామన్నారు. వరంగల్ లో జరిగే సభకు వెళ్లనివ్వకుండా పోలీసులు, ఆర్టీఏ, ఇతర శాఖల అధికారులతో అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. మళ్లీ సభ పేయిల్ అయ్యిందంటూ తప్పుడు కూతలు కూయడం అందరు గమనిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో 14 ఏండ్లు పోరాడితే వచ్చిన తెలంగాణపై ఇంకా కాంగ్రెస్ వాళ్లు మేమే ఇచ్చామని కూతలు కూస్తున్నారని, కాంగ్రెస్ మెడలు వంచితేనే తెలంగాణ వచ్చిందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రజతోత్సవ సభ విజయవంతం కావడంతో కడుపు మంటతో వాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సక్సెస్ కావడంతో కాంగ్రెస్ వాళ్లకు వణుకు పుట్టిందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తరలివెళ్లారని గుర్తుచేశారు. హామీల అమలులో విఫలమైన చేతగాని ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు. త్వరలోనే అన్ని జిల్లాలలో పాటు తాండూరు నియోజకవర్గంలో కూడా కేసీఆర్ తో లక్ష మంది జన సమీకరణ చేసి సభలు నిర్వహించి చూపిస్తామని సవాల్ చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీనీ నమ్మే పరిస్థితి ఉండబోదని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి….

7 నెలల బాలుడికి మెటబాలిక్ డిజార్డర్