ఎమ్మెల్యేకు అపురూప కానుక..!
– ఆర్తీరెడ్డి ఫోటోను అందజేసిన పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అపురూపమైన కానుకను అందజేశారు. దీపావళి పండగ సందర్భంగా ఆమె ఈ కానును అందించారు.
గత నెలలో తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల సావిత్రమ్మ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అంబరాన్నంటేలా నిర్వహించడం అందరికి గుర్తుండిపోయింది. ఈ వేడుకలలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సతీమణి ఆర్తీరెడ్డి, తల్లి ప్రమోదిని రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్‌లు హాజరయ్యారు. ఈ వేడుకలలో ఎమ్మెల్యే సతీమణి ఆర్తీరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బతుకమ్మ సంబరాలలో ఆర్తీరెడ్డి బతుకమ్మను ఎత్తుకున్న ఫోటోను అందంగా ఫ్రేమ్ చేయించారు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు. బుధవారం తాండూరుకు వచ్చిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి ఆయనకు దీపావళి కానుకగా సతీమణి ఆర్తీరెడ్డి ఫోటోను అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, టీఆర్ఎస్ యువనాయకులు సంతోష్‌గౌడ్, సంజీవరావు, రాజన్ గౌడ్ తదితరులు ఉన్నారు.
