యువత క్రీడల్లో సత్తా చాటాలి
– క్రీడాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాం
– తెలంగాణ చీఫ్ విప్ మ హేందర్ రెడ్డి
– తాండూరులో విలియంమూన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి : యువత క్రీడల్లో సత్తా చాటి ప్రపంచ వ్యాప్తంగా కీర్తిని పొందాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం తాండూరుకు చెందిన జీఎంకే బిల్డర్స్ అధినేత ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో తాండూరులో ఏర్పాటు చేసిన విలియంమూన్ ప్రీమియర్ లీగ్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ను చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

చీఫ్ విప్ మహేందర్ రెడ్డి టాస్ వేయడంతో పాటు బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాండూరులో జాతీయ స్థాయి టోర్నమెంట్ లు నిర్వహించడం జరిగిందని గుర్తుచేశారు. క్రీడాకారుల అభివృద్ధికి సహకరించడం జరిగిందన్నారు. యువత క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ, ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలు పొందాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తామన్నారు. ముజీబ్ ఖాన్ మాట్లాడుతూ మ హబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 40 జట్లతో రాష్ట్ర స్థాయి ప్రీమీయర్ లీగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. టోర్నమెంట్ లో విజేత, రన్నర్ జట్లకు ట్రోఫీ. నగదు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార సమన్వయ కర్త కరణం పురుషోత్తంరావు, సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, గడ్డలి రవీందర్, నిర్వహకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

