మైనర్ బాలికతో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
– ఫోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు
– వివరాలు వెల్లడించిన కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : మాయ మాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్న మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఆటో డ్రైవర్పై ఫోక్సో కేసు నమోదయ్యింది. మంగళవారం కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి ఓ ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించారు.

తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రకాష్ (22) అనే ఆటో డ్రైవర్ మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత ఆటో డ్రైవర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాలిక ఇంటికి వెళ్లిన తరువాత కుటుంభీకులకు తెలిపింది. దీంతో మంగళవారం కుటుంభీకులు కరణ్ కోట్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడైన ఆటో డ్రైవర్ పై ఫోక్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు వెల్లడించారు.


ఇదికూడా చదవండి…

