మంత్రి సబితారెడ్డి ఇంటా రాఖీ పండగ సందడి
– సోదరుడికి రాఖీ కట్టిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి నివాసంలో రాఖీ పండగ సందడి నెలకొంది. ఆదివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి సబితారెడ్డి తన సోదరుడు, స్వర్గీయ ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్ నర్సింహారెడ్డి(బాబు)కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ
అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగ శుభాకాంక్షలను తెలిపారు. రాఖీ పౌర్ణమి విశిష్టతను తెలుసుకుని పండగ విలువలను అందరిలో పెంపొందించాలని పిలుపునిచ్చారు.
