కాంగ్రెస్ పాదయాత్ర రద్దు
– ఎన్నికల కోడ్ కారణంగా నిర్ణయం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలంలో నేటి నుంచి ప్రారంభం కావాల్సిన కాంగ్రెస్ పాదయాత్ర రద్దు అయ్యింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, టీపీపీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నేటి నుంచి ప్రజా చైతన్య యాత్ర చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ చైతన్య యాత్రకు బ్రేక్ పడింది. ఆదివారం తాండూరు మండలంలోని కొత్లాపూర్ నుంచి ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారజ్ ఆధ్వర్యంలో యాత్రను చేపట్టేందుకు నేతలు సిద్దమయ్యారు. కాని ఎన్నికల కోడ్ కారణంగా యాత్రను వాయిదా వేసినట్లు నేతలు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
