రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన ఎజెండా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన ఎజెండా..!
– రైస్, దాల్ మిల్లులు నిర్మించుకునే వారికి సబ్సిడీ రుణాలు అందిస్తాం
– నూతన గోదాం, రైస్ మిల్లులను ప్రారంభించిన ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్
బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండలం నావంద్గి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాం, రైస్ మిల్లులను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ సత్యయ్యలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది వ్యవధిలోనే రాష్ట్రంలో ఉన్న 25 లక్షల రైతులకు రూ. 20వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనతను దక్కించుకుందన్నారు. అంతేకాకుండా కేవలం 9 రోజుల వ్యవధిలోనే రూ. 9వేల కోట్ల రైతు భరోసానిచ్చి రైతాంగానికి తమ ప్రభుత్వం రైతులపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. యాలాల్ మండలంలో లక్ష్మీనారాయణ పూర్, పెద్దేముల్ లో మంబాపూర్, బషీరాబాద్ లో కాశీంపూర్ లో మరో మూడు సొసైటీలు మంజూరు చేసిందని గుర్తు చేశారు.

గతంలో తాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా ఉన్నప్పుడు రైతులు, సొసైటీ బాగుండాలని ఆనాటి నాబార్డ్ చైర్మన్ చింతల గోవింద రాజుని హైదరాబాద్ కి తీసుకువచ్చి సొసైటీకి ఆదాయం వచ్చేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. వచ్చిన ఆదాయంతోనే ప్రతి సొసైటీకి గోదాం, రైస్ మిల్లు నిర్మించామన్నారు. సొసైటీల ద్వారా వ్యాపారాలు చేసే వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నామన్నారు. ఉద్యోగులకు భద్రత కల్పించి, చాలా మంది ఉద్యోగులనూ రెగ్యూలరైజ్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వైస్ డీసీసీబీ రవి గౌడ్, సొసైటీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

రైట్.. రైట్.. బీదర్..!