నీట మునిగిన జీవన్గీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నీట మునిగిన జీవన్గీ..!
– భారీ వర్షానికి పోటెత్తిన వరధ
– ఎస్సీ కాలనీ జలమయం
– ఇండ్లలోకి వరదనీరు
తాండూరు/బషీరాబాద్‌, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్‌ మండలంలోని జీవన్గీ గ్రామం నీట మునిగిపోయింది.
kvcs
గ్రామానికి వరధ నీరు పోటెత్తడంతో ఎస్సీ కాలనీ జలమయం అయ్యింది. సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ప్రతి యేడాది వర్షకాలంలో జీవన్గీ గ్రామంకు వరధ పొటెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది మొదటి సారి ఎస్సీ కాలనీకి వరధ పోటెత్తింది. వర్షానికి ఎస్సీ కాలనీలోని ప్రతి వీధిలో రోడ్లు గోదావరిలా మారాయి.

వరద నీరు కాలనీలో ఇండ్లలోకి చేరాయి. వరధనీరు ఇండ్లలోకి మోకాళ్ల లోతు వరకు వచ్చాయి. దీంతో ఇంట్లో ఉన్న పేదల వస్తువులు, రేషన్ సరుకులు నీట మునిగిపోయాయి. వరధ నీటితో ప్రజలు అవస్థలు పడ్డారు. మొత్తానికి సోమవారం కురిసిన భారీ వర్షానికి జీవన్గీ గ్రామం నీట మునిగిపోయింది.

ఇదికూడా చదవండి…

ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడి..!