విత్తన వినాయకుడికే జేజేలూ..!
– ప్రకృతి రక్షణకు భాగమవుదాం
– ఎన్ఎస్పీ ట్రస్ట్ ఆధ్వరంలో విగ్రహాల పంపిణీ
– హాజరైన రాజకీయ నేతలు, ప్రముఖులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : విత్తన వినాయకుడికి జేజేలు పలికి.. ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములం అవుదామని పలువురు నాయకులు, ప్రముఖులు అన్నారు. గురువారం తాండూరు పట్టణం మల్ రెడ్డిపల్లి రోడ్డు మార్గంలోని నూలి శుభప్రద్ ట్రస్టు (ఎన్ఎస్పీ) చైర్మన్ శివాని శుభప్రద్ పటేల్ ఆధ్వర్యంలో విత్తన వినాయకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ లు కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, స్వప్న పరిమళ్ తో పాటు పలువురు హాజరయ్యారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన కార్యక్రమంలో భాగంగా వ్యవస్థాపకులు మాజీ రాజ్యసభసభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు విత్తన వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు తాండూరులోని ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్, ఉద్యోగ సంఘాలు, వ్యాపారస్తులు, యువజన సంఘాలు, జర్నలిస్టులకు విత్తన వినాయకులను పంపిణీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలలో మట్టి వినాయకులతో పాటు విత్తన వినాయకులను ప్రతిష్టించడం ఎంతో శ్రేష్టమన్నారు. విత్తన వినాయకులను ప్రతిష్టించి పూజించిన తరువాత కొబ్బరితొట్టిలో నిమజ్జనం చేయడం వల్ల మొక్కలు పెరుగుతాయన్నారు. తద్వారా ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. విత్తన వినాయకునికి జేజేలు పలికి.. ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు హరిష్, భాను, ప్రకాష్, పలు సంఘాల ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

