రేపు రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు భారత మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని రాజీవ్ కాలనీ సమీపంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం.రమేష్ మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చెప్పారు. కావున పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై జయంతి వేడుకలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
———————————————————————————————-
