ఓర్వలేని రాజకీయాలు మానుకోండి..!
– ఓటమిని జీర్ణించుకోలేక అబద్ధపు ప్రచారాలు
– కొత్త తెరలేపిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– 25 పంచాయతీల ఏకగ్రీవ ఘనత మనోహర్ రెడ్డిది
– తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అబద్దపు ప్రచారాలకు తెరలేపారని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి విమర్శించారు. పంచాయతి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయాలను జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలపై రోహిత్ రెడ్డి చేసిన వాఖ్యలను చైర్మన్ బాల్ రెడ్డి ఖండించారు.

తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా 25 స్థానాలు ఏకగ్రీవంగా నిలిచాయన్నారు. ఈ ఘనత మనోహర్ రెడ్డికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం మనో రెడ్డి గారి పాలనకు నిదర్శనం అని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలలో ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రానీ గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని గ్రామాలలో పదికి పది వార్డ్ మెంబర్లుతో పాటు సర్పంచ్ ఉప సర్పంచ్ అభ్యర్థులు ఏకధాటిగా గెలవడం జరిగింది తెలిపారు. ఇలా వందకు పైగా స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నయా జోష్ వచ్చిందని అన్నారు.

ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీపడి ఇద్దరు లేదా ముగ్గురు పోటీ చేయడంతో మా పార్టీ వాళ్ళ మధ్యనే పోటీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది తప్ప వాస్తవంగా ఆయా గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి ఉనికే లేదని విమర్శించారు. వాపును చూసుకొని బలుపు అనుకోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అబద్దాలను ప్రచారం చేయడం లేవనెత్తారని అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఎన్నికలు గ్రామాలలో మెజార్టీ స్థాయిలో కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఉండటం జీర్ణించుకోలేని రోహిత్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి అసత్యాన్ని ప్రచారం చేయడం ఒకటే పనిగా పెట్టుకోవడం తాండూర్ ప్రజలంతా గమనిస్తున్నారు అని అన్నారు. రెండేళ్లు పాలన ఏ విధంగా సాగిందో మరో మూడేళ్ల పాలనలో తాండూరు రూపురేఖలు మార్చే విధంగా ప్రణాళికలు రచించడం జరుగుతుందన్నారు.

ఇదికూడా చదవండి…

