వాల్మీకీన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ జెండా పండ‌గ‌…

తాండూరు వికారాబాద్

వాల్మీకీన‌గ‌ర్‌లో టీఆర్ఎస్ జెండా పండ‌గ‌
-మాజీ కౌన్సిల‌ర్ ప‌రిమ‌ళ ఆధ్వ‌ర్యంలో జెండా ఆవిష్క‌ర‌ణ‌
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి 23వ వార్డు వాల్మీకీ న‌గ‌ర్‌లో టీఆర్ఎస్ జెండా పండుగ ఘ‌నంగా నిర్వ‌హించారు. గురువారం పార్టీ ఆదేశాల మేర‌కు వార్డులో మాజీ కౌన్సిలర్ ప‌రిమ‌ళ ర‌వీంద‌ర్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన జెండా పండుగ‌కు నాయ‌కులు హాజ‌రై జెండా ఆవిష్క‌రించారు. అనంత‌రం నేత‌లతో కలిసి రాష్ట్ర‌గీతం ఆలాపిస్తూ జెండాకు వంద‌నం చేశారు. త‌రువాత ఒక‌రికొకరు స్వీట్లు పంచుకుని సంబ‌రాలు చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పేద‌ల సంక్షేమానికి కృషి చేస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అబ్దుల్ ర‌వూఫ్‌, సీనీయ‌ర్ మ‌హిళ నాయకురాలు, కౌన్సిల‌ర్ విజ‌య‌దేవి, పార్టీ సీనీయ‌ర్ నాయ‌కులు గ‌డ్డ‌లి ర‌వీంద‌ర్‌, మ‌సూద్, కోటం సిద్దం లింగం, ద‌ర్మీది ర‌వీంద‌ర్, ద‌త్తాత్రేయ‌, శివ‌, వార్డు ప్ర‌జ‌లు, పార్టీ కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.