బుయ్యని దంపతులకు శుభాకాంక్షల వెల్లువ
– బెస్ట్ అవార్డు అందుకోవడం పట్ల హర్షం
– సన్మానించిన సంఘాలు ప్రతినిధులు, వ్యాపారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ | బుయ్యని సరళా రెడ్డి దంపతులకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది.

ఇటీవల ప్రైవేటు మీడియా సంస్థ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో ఆర్బీఓఎల్ ప్యాక్టరీ ఎండీ బుయ్యని సరళా రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లోనే సుస్థిరమైన వ్యాపారవేత్తగా బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డ్ దక్కింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా బుయ్యని సరళా రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.

ఇందులో భాగంగా మంగళవారం శ్రీనివాస్ రెడ్డి. సరళా రెడ్డి దంపతులను పలువురు సంఘాల ప్రతినిధులు, మహిళ నాయకులు, వ్యాపారులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్ సరళా రెడ్డికి బోకే అందించి సన్మానించారు.

అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి తరుపున ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షులు గూళీ పరిమేశ్వర్ స్వామి, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ, సహా కార్యదర్శులుగా పరమతి వెంకటేశం(మిర్చి), మంతన్ గౌడ్ అశోక్, కుమార్ వాల్మీకీలు శ్రీనివాస్ రెడ్డి, సరళా రెడ్డి దంపతులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఫర్టిలైజర్ వ్యాపారి రవికుమార్, పోటీ మహరాజ్ దేవాలయ చైర్మన్ ప్రసాద్ గౌడ్, మహిళ సంఘాల ప్రతినిధులు దంపతులను కలిసి సన్మానించి శుభకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

