పక్కాగా అమ్మ ఆదర్శ పనులు

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrపక్కాగా అమ్మ ఆదర్శ పనులు
– పాఠశాల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాలి
– మున్సిపల్ ప్రత్యేకాధికారి వినయ్ కుమార్
– పట్టణ పాఠశాలల పనులపై సమీక్ష
తాండూరు, దర్శిని ప్రతినిధి : అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని తాండూరు మున్సిపల్ ప్రత్యేకాధికారి వినయ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి వినయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల కింద తాండూరు పట్టణంలోని 27 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందన్నారు.

ఇందులో 15 పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసిందన్నారు. మున్సిపల్, పోలీసు, విద్యాశాఖ, కార్మిక శాఖల సమన్వయంతో పాఠశాలల అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి పనులు పూర్తయ్యేలా దృష్టిసారించాలన్నారు. ఆ తరువాత చేపట్టే బడిబాట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.

జూన్ 15న నాటికి పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, పట్టణ ఎస్ఐ కాశినాథ్, ఎంఈఓ వెంకటయ్య గౌడ్, కార్మిక శాఖ అధికారిణి శశికళ, మున్సిపల్ డీఈ ఖాజా, అమ్మ ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

తాండూరులో మల్లికార్జున స్వామి అప్పాజీ సందడి