పొరపాట్లకు తావివ్వొద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్
పొరపాట్లకు తావివ్వొద్దు..!
– ఎన్నికల నిర్వహణకు అప్రమత్తం తప్పనిసరి
– ఎన్నికల సాధారణ అధికారి రాజేంద్ర కుమార్ కటారియా
– తాండూరులో పోలింగ్ కేంద్రాలు, ఫెసిలిటేషన్ పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని చేవేళ్ల పార్లమెంటరీ ఎన్నికల సాధారణ అధికారి రాజేంద్ర కుమార్ కటారియా అన్నారు. ఆదివారం ఎన్నికల అధికారి రాజేంద్ర కుమార్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఉనూ హారతిలతో కలిసి తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలోని కందెనల్లి, యాలాల మండలంలోని రాజీవ్ కాలనీ, తాండూరు పట్టణంలోని సాయిపూర్ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.

ఆయా పోలింగ్ కేంద్రాలలో ఒటర్ల వివరాలు, డబుల్ ఓటర్ల వివరాలను తెలుసుకున్నారు. డబుల్ ఓటర్లు ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఓటర్ సిప్పుల పంపిణీ గురించి ఆరా తీశారు. ఇంటింటికి స్లిప్పులు అందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెసిలిటేషన్ కేంద్రంలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ గురించి ఆరా తీశారు.

అక్కడి నుంచి తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను సందర్శించి ఈవీఎం కమీషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి రాజేంద్ర కుమార్ కటారియా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

బీఎల్వోల నుంచి ఎన్నికల అధికారుల వరకు అందరు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా దృష్టిసారించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ శ్రీనివాస్ రావు, తహసీల్దార్ లు తారాసింగ్, కిషన్, డీపీఓ పరిశీలకుల లైసెన్ అధికారి శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

కారు గుర్తును మరువొద్దు..!