సందడిగా మహేంద్రుడి ఎమ్మెల్సీ నామినేషన్
– భారీగా తరలివెళ్లిన నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి నామినేషన్ సందడిగా జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మహేందర్‌రెడ్డి రెండోసారి అవకాశం
దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌లో భాగంగా సోమవారం ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్, ప్రకాష్ గౌడ్‌లతో కలిసి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ను వేశారు. అంతకుముందు మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డిలు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన మహేందర్‌రెడ్డి, శంభీపూర్ రాజులకు టీఆర్ఎస్ భీఫారాలను అందజేశారు. మహేందర్ రెడ్డి నామినేషన్‌ను పురస్కరించుకుని
వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునితారెడ్డితో పాటు తాండూరు నుంచి టీఆర్ఎస్ నేతలు భారీగా తరలివెళ్లారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణంపురుషోత్తంరావు, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, సీనీయర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, కౌన్సిలర్లు అబ్దుల్ రజాక్,
మంకాల రాఘవేందర్, వెంకన్నగౌడ్, సల్మా పాతిమా, ప్రవీణ్ కుమార్ గౌడ్, అశ్విని గుండప్ప, ఎర్రం వసంత, ముక్తార్, భీంసింగ్, మాజీ కౌన్సిలర్ జుబేర్ లాల, జెట్పీడీసీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), టీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల బాల్‌రెడ్డి, పరిమళ్ గుప్త, అజయ్ ప్రసాద్, ఎంపీటీసీలు,
యువ నాయకులు తాండ్ర రాకేష్, ఎర్రం శ్రీధర్, పలువురు నేతలు తరలివెళ్లి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ఎమ్మెల్సీ వాణీదేవి తదితర ప్రముఖులు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డితో పాటు శంభీపూర్ రాజులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
