డీజిల్.. గోల్‌మాల్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

డీజిల్.. గోల్‌మాల్..!
– ట్యాంక్ ఫుల్ చేయకుండా మోసం
– నిర్వహకులను నిలదీసిన డ్రైవర్లు
– తాండూరు పట్టణంలో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పెట్రోల్ బంకు నిర్వహకులు డీజిల్ గోల్‌మాల్‌కు పాల్పడ్డారని డ్రైవర్లు మండిపడ్డారు. వాహనానికి ట్యాంకు ఫుల్ చేయకుండా డబ్బులు తీసుకుని మోసానికి పాల్పడ్డారని నిలదీశారు. ఈ సంఘటన గురువారం సాయంత్రం తాండూరు పట్టణం విలియమూన్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది.

బాధిత డ్రైవర్లు తెలిపిన వివరాల ప్రకారం… పట్టణానికి చెందిన పల్లి శ్రీను అనే వ్యక్తికి చెందిన తుఫాన్ వాహనం.. విలియమూన్ చౌరస్తా సమీపంలోని ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన ఇలాహి పెట్రోల్ బంకులో డీజిల్ వేసుకునేందుకు వెళ్లింది. పంపులో సిబ్బందితో ట్యాంకు ఫుల్ డీజిల్ వేయాలని కోరాడు. సిబ్బంది మిషన్ లో రూ.5వేలు ఫిక్స్ దాని విలువతో డీజిల్ పోశారు. అయితే అనుమానం వచ్చిన డ్రైవర్ యజమానికి డీజిల్ తక్కువ వేశారని యజమానికి తెలిపాడు. దీంతో డ్రైవర్లు అందరు కలిసి బంకు వద్దకు చేరుకున్నారు.
kvcs
నిర్వహకులతో వాదనకు దిగారు. రూ.5వేలు ఫిక్స్ చేసి.. డీజిల్ ఎలా వేస్తారని నిలదీశారు. అక్కడే ఉన్న నిర్వహకులు వచ్చి.. డ్రైవర్లతో మాట్లాడారు. మా బంకులో ఎలాంటి గోల్ మాల్ జరగదని, కావాలంటే డీజిల్ పోసుకున్న వాహనాన్ని తీసుకవచ్చి కొలుచుకోవాలని సూచించారు. కాని అప్పటికే ఆ వాహనంకు అత్యవసర సర్వీసు ఉండడంతో వెళ్లిపోయిందని చెప్పారు. కాని.. డీజిల్ వేయించుకున్న వాహనంలో అఫ్ ట్యాంకు డీజిల్ ఉందని, రూ. 5వేలది వేసినా కూడా ఫుల్ ట్యాంకు కాలేదని, దీనికేం సమాధానం చేస్తారని నిలదీశారు. నిర్వహకులు ఏదైనా ఉంటే అధికారులకు ఫిర్యాదులు చేసుకోవాలని, మా బంకులో మోసాలు చేయలేదని తేల్చిచెప్పారు. దీంతో తమకు న్యాయం చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. నిర్వహకుల మోసాలను ఎండగడాతామని హెచ్చరించారు.

ఇదికూడా చదవండి…

గడప గడపకు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’..!